TELANGANA: తెలంగాణ పోలీసుల అప్రమత్తతతో పెను ముప్పు తప్పింది. హైదరాబాద్లో పేలుళ్లకు కుట్రపన్నిన ఇద్దరు ఉగ్రవాదులను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. By: BCN TV NEWS సౌదీ నుంచి ఐసీస్ ఆదేశాలతో నగరంలో విధ్వంసం సృష్టించేందుకు దుండగలు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. మన పోలీసుల అప్రమత్తత కారణంగా హైదరాబాద్ నగరానికి పెను ముప్పు తప్పిందని చెప్పవచ్చు.
దుండగుల కుట్రను ఎలా ఛేదించిందీ పోలీసు అధికారులు వెల్లడించారు. సౌదీ నుంచి వచ్చిన ఆదేశాలతో నగరంలో విధ్వంసం సృష్టించేందుకు ఇద్దరు దుండగులు పక్కా ప్లానింగ్ తో నగరంలోకి అడుగు పెట్టారని మన కౌంటర్ ఇంటెలిజెన్స్ కు సమాచారం వచ్చినట్లు చెబుతున్నారు. ఇద్దరు దుండగుల్లో ఒకరు హైదరాబాద్ నగరానికి చెందిన వాడు కాగా, మరొకడు ఏపీలోని విజయనగరానికి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు.
దుండగులు ఇద్దరు నగరంలో పేలుళ్లకు ప్లాన్ చేస్తుండటంతో పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. దుండగులు సిరాజ్, సమీర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేసి హైదరాబాద్ లో డమ్మీ బ్లాస్ట్ కు ఈ ఇద్దరు సిద్ధమయ్యారని పోలీసులు చెబుతున్నారు. దుండగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారికి ఉగ్ర లింకులు ఎలా ఏర్పడిందీ విచారిస్తున్నారు. నగరంలో పేలుళ్లకు ప్రయత్నించిన వారిద్దరూ తెలుగు వారే కావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.