నల్గొండ జిల్లా, భువనగిరి రూరల్: పశ్చిమబెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలో వైద్య విద్యార్థిని హత్యాచారానికి నిరసనగా దేశవ్యాప్త ఓపీ సేవల బంద్‌లో భాగంగా జిల్లా కేంద్రంలో ఐఎంఏ, ప్రభుత్వ, గ్రామీ ణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో శనివారం వైద్యు లు రోడ్డెక్కారు. స్థానిక జిల్లా కేంద్ర ఆస్పత్రి ఆవరణలో విధులను బహిష్కరించి సేవలను నిలిపివేసి ధర్నా నిర్వహించారు. అక్కడి నుంచి జగదేవ్‌పూర్‌చౌరస్తా మీదుగా ర్యాలీ నిర్వహించి అంబేడ్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల లు వేసి రాస్తారోకో చేపట్టారు. దీంతో 30 నిమిషా ల పాటు రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు జోక్యం చేసుకుని ట్రాఫిక్ ను పునరుద్ధరించారు.
ఇలాంటి అమానవీయ ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో అత్యవసర సేవలు మాత్రమే సాగాయని డీసీహెచ్‌వో డాక్టర్ చిన్నానాయక్ తెలిపారు. కాగా ప్రైవేట్ ఆస్పత్రులన్నీ మూతపడ్డాయి. కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ విజయ్‌భార్గవ్, వైద్యులు అజయ్‌కుమార్, ఎడ్ల అనిల్‌రెడ్డి, సుమంత్, కేఎల్‌ఎన్.ప్రసాద్, ప్రశాంతి, ఇందిర, గ్రామీణ వైద్యుల సంఘం ప్రతినిధులు కొండ సోమయ్య, నర్సింహయాదవ్, నర్సింహారెడ్డి, రఘునందన్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
బీబీనగర్ ఎయిమ్స్‌లో..
బీబీనగర్ : కోల్‌కతాలో వైద్యవిద్యార్థినిపై హ త్యాచార ఘటనపై బీబీనగర్ ఎయిమ్స్ వైద్యులు, వైద్యవిద్యార్థులు గళమెత్తారు. విధులు, సేవలను నిలుపుదల చేసి ఎయిమ్స్ ఎదుట బైఠాయించి ఆం దోళనకు దిగారు. అనంతరం ఎయిమ్స్ ప్రాంగణం నుంచి జాతీయ రహదారి మీదుగా రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ర్యాలీ నిర్వహించారు. బీబీనగర్ పట్టణంలో ని ప్రధానకూడలి పోచంపల్లి చౌరస్తాలో రహదారి ని దిగ్బంధించి వైద్యవిద్యార్థులు గంటకు పైగా ధర్నా కొనసాగించారు.
వైద్యులపై జరుగుతున్న దా డులు, అత్యాచారాల నుంచి రక్షణ కల్పించి, బాధ్యుల ను కఠినంగా శిక్షించాలని నిలదీశారు. వైద్యుల పై నిత్యకృత్యంగా మారిన దాడులు, హత్యలు, అత్యాచారాలకు పాల్పడే వారిపై శిక్షలు కఠినంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డి మాండ్ చేశారు. దేశంలో వైద్యుల పై జరుగుతున్న దాడులు, అత్యాచారాలపై ఈ సందర్భంగా డెమో ప్రదర్శించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.