ఫార్ములా-ఈ రేస్ కేసులో ఈడీ ఎంట్రీ... కేటీఆర్ ఆసక్తికర నిర్ణయం!


TELANGANA/HYD: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత సంచలనంగా మారింది ఫార్ములా-ఈ రేస్ కేసు వ్యవహారం. ఈ కేసులో బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఏసీబీ ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసింది. ఈ నేపథ్యలో తాజాగా ఈ కేసులోకి తాజాగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ ఇచ్చిందని తెలుస్తోంది.

తెలంగాణ రాజకీయాల్లో అత్యంత హాట్ టాపిక్ గా మారింది ఫార్ములా-ఈ రేస్ కారు కేసు! ఈ నేపథ్యంలో తాజాగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా... ఈ వ్యవహారంపై ఏసీబీ నుంచి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్.ఐ.ఆర్) సహా పలు పత్రాలు కోరినట్లు తెలుస్తోంది.

విదేశీ సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు జరిగాయన్న ఆరోపణలు రావడంతో.. రెగ్యులర్ ప్రాసెస్ లో భాగంగానే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ ఇచ్చిందని అంటున్నారు. ఈ సమయంలో ఏసీబీ నుంచి తీసుకున్న పత్రాల పరిశీలన అనంతరం వారి నెక్స్ట్ స్టెప్ ఉండే అవకాశాలున్నాయని అంటున్నారు. 

హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్!: 
బీఆరెస్స్ హయాంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ను ప్రధాన నిందితుడు (ఏ1) గా పేర్కొంటూ తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... నాటి మున్సిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ (ఏ1), హెచ్.ఎం.డీ.ఏ. నాటి చీఫ్ ఇంజినీర్ బీ.ఎల్.ఎన్. రెడ్డి (ఏ3) లను ఎఫ్.ఐ.ఆర్.లో చేర్చింది.

ఈ నేపథ్యంలో బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా... తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ బ్రేక్ తర్వాత ఈ పిటిషన్ పై విచారణ చేపట్టాలని ఆయన ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. దీంతో... హైకోర్టులో దీనికి సంబంధించి క్వాష్ పిటిషన్ పై తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయనేది ఆసక్తిగా మారింది. ఈ కేసును హైకోర్టు క్వాష్ చేస్తే.. అది ప్రభుత్వానికి బిగ్ షాక్ గా మారే అవకాశం ఉండగా... క్వాష్ చేయని పక్షంలో కేటీఆర్ ముందస్తు బెయిల్ కోరే అవకాశం ఉండొచ్చని అంటున్నారు.