మహబూబ్‌నగర్ జిల్లా, వనపర్తి రాజీవ్‌చౌరస్తా, ఆగస్టు 17: జిల్లాలో పోడు పట్టాలు ఇచ్చిన రైతుల సమస్యలు పరిష్కరించేందు కు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శనివారం రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీ ణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కతో కలిసి కలెక్టర్లు, అటవీశాఖ అధికారులు శాసన సభ్యులతో పోడు భూమి సమస్యలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీ క్ష నిర్వహించారు. పోడు పట్టాలు ఇచ్చిన రైతుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని, ఇచ్చిన పట్టా భూములకు హద్దులు చూపించాలని కలెక్టర్లకు సూచించారు.
కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ... వనపర్తి జిల్లాలో 419 దరఖాస్తులు ఆమోదించి 474 ఎకరాలకు పోడుపట్టాలు ఇచ్చినట్లు తెలిపారు. పోడు పట్టాలు పొందిన రైతుల సమస్యలు ఏమైనా ఉంటే అటవీ, ట్రైబల్ వెల్ఫేర్ శాఖల అధికారులతో సమన్వ యం చేసుకొని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుం టామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి నవీన్ రెడ్డి, జిల్లా షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి అధికారి నుశిత తదితరులు వీసీలో పాల్గొన్నారు.
ఎలక్టరల్ రోల్ తప్పులు లేకుండా రూపొందించాలి
తప్పులు లేకుండా ఎలక్టరల్ రోల్ రూపొందించాల ని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శనివారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ తహ సీల్దార్లు, ఆర్డీవోతో సమావేశం నిర్వహించి ఓటరు జాబితా రూపొందించడంపై అవగాహన కల్పించారు. ఏఈఆర్‌వోలు ఎలక్టరల్ మాన్యుల్ పుస్తకాన్ని క్షుణ్ణం గా చదవాలని, అందులో ఉన్న నిబంధనలు ఆకళింపు చేసుకుంటే తమ బాధ్యతలు సులువుగా నిర్వర్తిం చవచ్చని తెలిపారు. ఎలక్టరల్‌కు, ఓటరుకు ఉన్న తేడా ఏంటీ, పార్ట్ అంటే ఏంటీ పోలింగ్ స్టేషన్ అంటే ఏమిటీ, ఏఈఆర్‌వో బాధ్యతలు రిటర్నింగ్ అధికారి బాధ్యతలు వివరాలు స్పష్టంగా తెలియజే శారు.
ఫారం 6,7,8 ఎవరెవరు దరఖాస్తు చేయొచ్చు, ఎందుకు దరఖాస్తు చేసుకోవాలి అనే విషయాలపై అవగాహన కల్పించారు. రెండు మూడు రోజుల్లో బీఎల్‌వోలకు, బీఎల్‌వో సూపర్‌వైజర్లకు వారి బాధ్యత లను తెలియజేస్తు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఎలక్టరల్ రోల్‌లో 20 సంవత్సరాల కాలంలో ఏదైనా ఎన్నికల్లో పోటీ చేసిన ఎలక్టర్, ఉద్యోగులు, న్యాయవాదులు, జర్నలిస్టుల పేర్లు ఎలక్టరల్ రోల్‌లో మార్క్ చేయాలని సూచించారు. సమావేశంలో అద నపు కలెక్టర్ నగేష్, ఆర్డీవో పద్మావతి, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.