నిజామాబాద్‌లో దారుణం.. పిన్ని టార్చర్..


నిజామాబాద్ జిల్లా: నవీపేట్ మండలంలోని విషాదం నెలకొంది. ఫక్రాబాద్ రైల్ పట్టాలపై బార్యా భర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు పొత్తంగల్ మండలంలోని హెగ్‌డోలీ గ్రామానికి చెందినవారు. అనీల్, శైలజ అనే దంపతులు చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసి బంధువులకు, కోటగిరి పోలీసులకు పంపించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు లోకేషన్‌ను ట్రేస్ చేశారు. ఆ పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకి లభించలేదు. చివరికి ఫకీరాబాద్ మిట్టపల్లి రైల్వేలైన్‌లో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. తాము ఆత్మహత్య చేసుకోడానికి తమ పిన్ని కారణమని శైలజ తెలిపింది. తన అత్త మామలు ఎలాంటి తప్పు చేయలేదని వారిని ఇబ్బంది పెట్టకూడదని విజ్ఞప్తి చేసింది.


తమ పిన్ని తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని శైలజ ఆవేదన వ్యక్తం చేసింది. వివాహానికి ముందు తప్పుడు పని చేసినట్లు ఆమె ఒప్పుకుంది. ఆ విషయం తన భర్తకు కూడా తెలుసునని, తన తప్పును అంగీకరించి తనను వివాహం చేసుకున్నాడని, అయినా తమ పిన్ని తనపై దుష్ప్రచారం చేస్తోందని.. ఎంత చెప్పినా వినకుండా ప్రచారం చేస్తోందని దీంతో మనస్తాపం చెంది ఇద్దరం ఆత్మహత్య చేసుకుంటున్నామని శైలజ తన సెల్ఫీ వీడియోలో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.